'స్ప్రింగ్ ఫెస్టివల్ గాలా'... కళాకారులతో అదిరిన వేదిక - 2020 spring festival gala in china
చైనాలో '2020 స్ప్రింగ్ ఫెస్టివల్ గాలా' సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. భిన్న రంగాల కళాకారుల వైవిధ్యమైన ప్రదర్శనలకు ఈ కార్యక్రమం వేదికైెంది. ప్రదర్శించిన సంప్రదాయ, డిస్కో నృత్యాలు, సంగీత కళాకారులు ఆలపించిన పాటలతో అన్నీ వయస్సులవారు ఉర్రూతలూగారు. హాస్యనాటకాలు... కార్యక్రమానికి హాజరైన వారందరి చేత విపరీతంగా నవ్వులు పూయించాయి. ఇక అన్నింటికంటే 3డీ లైట్ షో చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. వేల సంఖ్యలో ఔత్సాహికులు ఈ కార్యక్రమానికి హాజరై ఆనందంలో మునిగితేలారు.
Last Updated : Feb 18, 2020, 9:52 AM IST