అమెరికా ఆవిష్కర్త కొలంబస్ విగ్రహాలు ధ్వంసం - అమెరికా
ఇటలీకి చెందిన నావికుడు, ప్రపంచ యాత్రికుడు క్రిస్టోఫర్ కొలంబస్ విగ్రహాలను అమెరికా శాన్ఫ్రాన్సిస్కోలో కొందరు దుండగులు ధ్వంసం చేశారు. పలు చోట్ల ఆయన విగ్రహాలపై ఎరుపు రంగు పెయింట్ పోశారు. అన్ని విగ్రహాల్ని ధ్వంసం చేస్తామని, కొలోనిజర్స్ అందరినీ వధిస్తామంటూ విగ్రహాల కింది భాగంలో రాతలు రాశారు. అయితే.. ఈ ఘటనకు కారకులు ఎవరో తెలియరాలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం.. అక్కడి సిబ్బంది ఆ విగ్రహాలన్నింటినీ శుభ్రం చేసుకొని 'కొలంబస్ డే'ను ఘనంగా జరుపుకున్నారు.
Last Updated : Oct 16, 2019, 8:39 AM IST