భార్య, అత్తమామలపై దాడి.. కత్తితో రోడ్డుపైనే దారుణంగా! - amritsar attack on family
husband attack on wife family: కత్తితో భార్య, అత్తమామలపై దాడిచేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన పంజాబ్లోని అమృత్సర్ జిల్లా ఉధంసింగ్ నగర్లో గురువారం జరిగింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. భార్యాభర్తల మధ్య ఇంతకుముందు నుంచే గొడవలు జరుగుతున్నాయని, దీంతో విడిగా ఉంటున్నారని పోలీసులు తెలిపారు. హత్య చేయాలనే ఉద్దేశంతోనే తన భర్త ఈ దాడికి పాల్పడ్డాడని అతని భార్య సిమ్రాన్ కౌర్ ఆరోపించారు. ప్రస్తుతం గాయాలపాలైన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST