లోయ అంచున వేలాడిన బస్సు.. త్రుటిలో తప్పిన ప్రమాదం - HRTC bus accident in kullu
హిమాచల్ ప్రదేశ్‌లో ఒక ఒళ్లుగగుర్పొడిచే ఘటన జరిగింది. హెచ్ఆర్టీసీ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. అదుపుతప్పి కొండ అంచు వరకు వెళ్లి ఆగింది. కులు జిల్లా బంజార సబ్‌డివిజన్ సైంజ్ లోయలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు లోపల ఉన్న ప్రయాణికులను స్థానికులు సురక్షితంగా కాపాడారు. పెను ప్రమాదం తప్పినందుకు అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో కొంత మందికి గాయాలయ్యాయి, వారిని చికిత్స కోసం స్థానిక సైంజ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Last Updated : Feb 3, 2023, 8:11 PM IST