సినీ కార్మికుల పిల్లలకు మోహన్‌బాబు ఆఫర్.. ఏంటంటే? - మోహన్‌బాబు ఆఫర్
ప్రముఖ హీరో మోహన్‌బాబు తెలుగు సినీ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు ఆఫర్ ప్రకటించారు. తనకు సంబంధించిన మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో చేరే సినీ కార్మికుల పిల్లలకు ఫీజు రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పిల్లల విద్యా భవిష్యత్‌కు అండగా నిలవాలని సినీ కార్మికులను మోహన్ బాబు కోరారు. ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్ మెంట్, నర్సింగ్, డిగ్రీ, పీజీ సహా రీసెర్చ్ స్టడీస్ లో మల్టీ డిసిప్లినరీ కోర్సులు చదవాలనుకుంటున్న సినీ కార్మికుల పిల్లలకు ట్యూషన్ ఫీజులో స్కాలర్ షిప్ ఇవ్వనున్నట్లు తెలిపారు
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST