జగిత్యాలలో కనువిందు చేసే ప్రకృతి సోయగాలు - జగిత్యాలలో కనువిందు చేసే ప్రకృతి సోయగాలు
తెల్లవారుతుండగా జగిత్యాలలో కొత్త అందాలు పట్టణ వాసులను కనువిందు చేశాయి. అప్పుడే లేత వర్ణంలో భానుడు తన వెలుగులు పంచేందుకు బయటకు వస్తున్న వేళ... ఆకాశం ఎరుపు వర్ణంలో మారి... జగిత్యాల టవర్ ప్రాంతం మెరిసి పోయింది. రాత్రి వర్షం కురిసి పట్టణం కొత్త అందాలు అద్దుకుంది. స్థానికులకు ఎన్నడూలేని విధంగా మారిన వాతావరణం ఓ కొత్త అనుభూతినిచ్చింది. జలకళతో ఉన్న చింతకుంట చెరువు ప్రాంతం ప్రకృతి ప్రేమికులను కట్టిపడేసింది. జగిత్యాల అందాలు మీకోసం...
TAGGED:
jagityala andalu