Pythons on road: రోడ్డు పైకి వచ్చిన కొండ చిలువలు.. వాహనదారులు హడల్.. - two pythons found on road
Pythons on road: అభయారణ్యంలో ఉండాల్సిన కొండ చిలువలు.. ఒక్కసారిగా రోడ్డు పైకి వచ్చి వాహనదారులను, స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. పరకాల హనుమకొండ ప్రధాన రహదారిపై శాయంపేట మండలం మందారపేట గ్రామం వద్ద ఈ దృశ్యాలు చరవాణుల్లో బంధీ అయ్యాయి. రెండు కొండ చిలువలు రోడ్డుపైకి వచ్చి కాసేపు అక్కడే కదలకుండా ఉండిపోయాయి. దీంతో వాహనదారులు తమ వాహనాలను నెమ్మదిగా పోనిచ్చారు. కొందరు రోడ్డు పైకి వచ్చిన కొండచిలువలను వీడియోల్లో, ఫొటోల్లో బంధించారు.