ప్రతిధ్వని: తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలకు ఉన్న భూములెన్ని? - ప్రతిధ్వని
దేవాదాయ భూములు, ఆస్తులకు దేవుళ్లే యజమానులని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పూజారులు, ధర్మకర్తలు కేవలం నిర్వాహకులు మాత్రమేనని, ప్రైవేటు ఆలయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం కుదరదని తేల్చిచెప్పింది. దేవుళ్ల సేవకులుగా ఆలయ భూముల సంరక్షణ విధులను పూజారులు, ధర్మకర్తలు నిర్వహించవచ్చన్న కోర్టు... ఎండోమెంట్ ఆలయాల ఆస్తులకు కలెక్టర్లు మేనేజర్లుగా వ్యవహరించే వీలుందని తెలిపింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలకు ఉన్న భూములెన్ని? అవి ఎవరి అధీనంలో ఉన్నాయి? అసలు ఏది పబ్లిక్ ఆలయం? ఏది ప్రైవేటు ఆలయం? ఆలయ భూముల నిర్వహణంలో ఎవరి పాత్ర ఏమిటి? అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని డిబేట్.