తెలంగాణ

telangana

PRATHIDWANI: ప్రైవేట్ ఆసుపత్రుల్లో అధిక ఫీజుల కట్టడి ఎలా?

By

Published : Jul 8, 2021, 9:08 PM IST

కరోనా కష్టకాలంలో రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రులపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అధిక ఫీజులు, అనవసర చికిత్సలు, తప్పుడు రిపోర్టులు... ఇలా ఇష్టారాజ్యంగా రోగులను ఇబ్బందుల పాలు చేశాయన్న విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో కోర్టులు కల్పించుకుని ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయాల్సి వచ్చింది. అనంతరం అక్రమాల ఆరోపణలు వచ్చిన ఆసుపత్రులకు ప్రభుత్వం నోటీసులిస్తే... ప్రైవేటు ఆసుపత్రులు వాటినీ ఉల్లంఘించాయంటూ ఫిర్యాదులొచ్చాయి. కొన్ని ఆసుపత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయినా ప్రైవేటు ఆగడాలకు అడ్డుకట్ట పడే పరిస్థితి లేదు. దీంతో ప్రైవేటు ఆసుపత్రుల సమగ్ర నియంత్రణకు కేంద్ర చట్టాన్ని అన్వయించుకోవాలని భావిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొత్త చట్టంతో ప్రైవేటు వైద్యంపై పడే ప్రభావం ఎంత? ఇదే అంశంపై ఈరోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చా కార్యక్రమం.

ABOUT THE AUTHOR

...view details