తెలంగాణ

telangana

ETV Bharat / videos

Viral video: వస్త్ర దుకాణంలో మయూరం.. ఎందుకొచ్చిందో.? - peacock videos

By

Published : Aug 12, 2021, 7:35 PM IST

Updated : Aug 12, 2021, 8:00 PM IST

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్​లో జాతీయ పక్షి సందడి చేసింది. అడవుల్లో అరుదుగా కనిపించే మయూరం ఏకంగా పట్టణంలోని ఓ వస్త్ర దుకాణంలోకి దూరింది. అకస్మాత్తుగా నెమలి(Peacock) కనిపించడంతో షాపు యజమానితో పాటు కొనుగోలుదారులు షాక్‌కు గురయ్యారు. బట్టల దుకాణంలోకి దూరి చిందర వందర చేసింది. ఎటు వైపు వెళ్లాలో అర్థం కాక బట్టల్లోకి దూరే ప్రయత్నం చేసి అన్ని వస్త్రాలను కిందకు పడేసింది. దాని అవస్థలు గమనించిన షాపు యజమాని.. మయూరం జోలికి వెళ్లకుండా నేరుగా అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు వస్త్రదుకాణానికి చేరుకొని నెమలిని పట్టుకొని తమ వెంట తీసుకెళ్లారు.
Last Updated : Aug 12, 2021, 8:00 PM IST

ABOUT THE AUTHOR

...view details