'నవరాత్రుల్లో ఇలా చేస్తే.. మీ ఇంట్లో దుష్ట శక్తులు తొలిగిపోతాయి'
దసరా శరన్నవరాత్రులు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి. ఈ నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో దర్శనమిస్తుంది. తొమ్మిదో రోజు మహిషాసుర మర్ధిని అలంకారంలో జగన్మాత అభయప్రదానం చేస్తుంది. ఈరోజు ఎరుపు రంగు వస్తాల్ని ధరించి... వడపప్పు, పానకంతో మహిషాసుర మర్ధిని అమ్మవారిని పూజించాలి. అమ్మవారి పూజ చేసేవారు ప్రతిరోజు తలంటూ స్నానం చేయాలి. అలాగే ఈ శరన్నవరాత్రుల్లో క్షవరం చేయించుకోకూడదు. ఈ నియమాలు పాటిస్తూ అమ్మవారిని ఆరాధిస్తే... దేవి కృపకు పాత్రులు కావచ్చు. అమ్మవారి అనుగ్రహం కలిగి మీ సమస్యలు తొలిగిపోతాయి. అంతేకాదు ఇవాళ ఎర్రని పుష్పాలతో పూజలు నిర్వహించాలి. తొమ్మిదో రోజు దేవి చిత్రపటం వద్ద గట్టిగా గంట మోగించాలి. ఇలా చేస్తే.. వారి ఇంట్లో ఎటువంటి దుష్ట శక్తులు ఉన్నా... నశిస్తాయి.