'మీ జీవితంలో కష్టాలు తొలగాలంటే ఇలా చేయాలి' - పూజ ఎలా చేయాలంటే
దసరా శరన్నవరాత్రులు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి. ఈ నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో దర్శనమిస్తుంది. ఎనిమిదో రోజు దుర్గాదేవి అలంకారంలో జగన్మాత అభయప్రదానం చేస్తుంది. ఈరోజు తప్పకుండా ఎరుపు రంగు వస్త్రాల్ని ధరించి అమ్మవారికి పూజలు నిర్వహించాలి. దుర్గాదేవి చిత్రపటం వద్ద నాలుగు వత్తులతో దీపారాధన చేయాలి. దుర్లభః దుర్గమః దుర్గ... దుఃఖ హాత్రి సుఖ ప్రదః అనే నామాన్ని వీలైనన్ని సార్లు జపిస్తే... దుర్గమ మైనటు వంటి కష్టాల నుంచి చాలా సులభంగా బయట పడవచ్చు. నరగోష.. దృష్టి దోషం అంతః శత్రు బాధలు పోవాలంటే మంత్రన్ని జపించాలి.