'విద్యార్థులు విద్యారంగంలో రాణించాలంటే.. ఈ మంత్రం జపించాలి' - దసరా పూజలు
దసరా శరన్నవరాత్రులు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి. ఈ నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో దర్శనమిస్తుంది. ఏడో రోజు సరస్వతి దేవి అలంకారంలో జగన్మాత అభయప్రదానం చేస్తుంది. ఈరోజు తెలుపు రంగు వస్తాల్ని ధరించి... సరస్వతి దేవిని తెల్లటి పుష్పాలతో పూజించాలి. శరన్నవరాత్రుల్లో దేవి పూజ చేసే వారు అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి. ఆ కుంకుమను నుదుటన పెట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. విద్యార్థులు ఎవరైనా విశేషరంగంలో రాణించాలంటే... ఈ ఏడో రోజున 'సరస్వతి శాస్త్రామయి గుహాంబ గుహ్యారూపిణి' అనే చిన్న మంత్రాన్ని చదువుకోవాలి. ఈ మంత్రం చదువుకుంటే విద్యార్థులకు తిరుగులేని విధంగా అమోఘమైన శుభాఫలితాలు పొందుతారు.