ప్రకృతి ఒడిలో ముత్యాల జలపాత అందాలు చూడతరమా..! - ముత్యాల జలపాతం
ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రారం సమీప అడవుల్లోని ముత్యాల జలపాతం అందాలు ఆకట్టుకుంటున్నాయి. గత నాలుగు రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ముత్యాల జలపాతం.. నిండుగా కొండపై నుంచి కిందికి దూసుకొస్తోంది. ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా ఉన్న ఈ అద్భుత దృశ్యాలు పర్యటకులను మధురానుభూతికి గురిచేస్తున్నాయి.