ర్యాంప్‌పై చిన్నారుల హంసనడకలు - Kids Fashion Show hyderabad
🎬 Watch Now: Feature Video
ముద్దులొలికే చిన్నారులు ర్యాంప్‌పై చిన్నిచిన్ని నడకలతో మురిపించారు. చూడముచ్చటైన వస్త్రధారణతో చూపరులను కట్టిపడేశారు. చిన్నారులలో ఉన్న ప్రతిభను ప్రోత్సహించేందుకు కిడ్స్ ఫ్యాషన్ వీక్ పేరుతో హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఫ్యాషన్ షోను నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు సంప్రదాయ పంచెకట్టు, రంగు రంగుల దుస్తుల్లో ర్యాంప్‌పై క్యాట్‌వాక్‌తో కనువిందు చేశారు. బెంగుళూరు, పుణె, దిల్లీ, కలకత్తా, పాట్నా, హైదరాబాద్ నుంచి చిన్నారులు పాల్గొని ఆత్మవిశ్వాసంతో సందడి చేశారు.