ఆకాశవీధుల్లో కొండపోచమ్మ అందాలు చూద్దామా! - Paramotoring
సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్.. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ప్రాజెక్టును చూడటానికి..ప్రతి రోజు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న ఈ జలాశయాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఒక ప్రైవేటు సంస్థ కొండపోచమ్మ సాగర్ వద్ద.... పారా మోటరింగ్ సేవలు ప్రారంభించింది. రోజూ ఉదయం, సాయంత్రం పారామోటరింగ్ ద్వారా పర్యాటకులకు ఆకాశం నుంచి కొండపోచమ్మ సాగర్ అందాలు చూసే అవకాశం కల్పిస్తోంది.