తెలంగాణ

telangana

ETV Bharat / videos

Cultural program at shilpakala vedika : కనులవిందుగా శిల్పాకళావేదికలో సాంస్కృతిక కార్యక్రమం - తెలంగాణ వార్తలు

By

Published : Dec 27, 2021, 12:55 PM IST

Cultural program at shilpakala vedika : హైదరాబాద్ మాదాపూర్​లోని శిల్పకళావేదికలో కాకతీయ నాట్య మండలి ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమం కనులవిందుగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, రమణాచారి హాజరయ్యారు. డాక్టర్ పద్మజా రెడ్డి నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పలువురు కళాకారుల నాట్య ప్రదర్శనలు కనులవిందుగా సాగాయి. నిత్యం పని ఒత్తిడితో గడిపే ప్రజలకు సాంస్కృతిక కార్యక్రమాలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అథిథులు అభిప్రాయపడ్డారు. కళాకారులను అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details