ఆకట్టుకున్న కౌబాయ్ థీమ్ ఫ్యాషన్ షో.. అలరించిన యువతీ, యువకులు - హైదరాబాద్ వార్తలు
Cow Boy Theme Show: హైదరాబాద్‌లో కౌబాయ్ థీమ్‌తో వినూత్నగా నిర్వహించిన ఫ్యాషన్ షో కన్నుల పండువగా సాగింది. పార్టీ ప్రియులకు సరికొత్త అనుభూతిని అందించింది. శిల్పారామంలోని రాక్ హైట్స్‌లో ప్రత్యేక ఫ్యాషన్ షో జరిగింది. కార్యక్రమంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. యువతీ, యువకులు కౌబాయ్ గెటప్‌లలో ర్యాంప్‌పై అదరగొట్టారు. యువతుల నృత్యాలు ప్రేక్షకులను మంత్రుముగ్ధులను చేశాయి.