తెలంగాణ

telangana

ETV Bharat / videos

BOGATHA WATERFALLS: ఉరకలెత్తుతున్న బొగత జలపాతం.. అందాలు చూసొద్దామా.! - పొంగి పొర్లుతున్న బొగత జలపాతం

By

Published : Jul 14, 2021, 1:52 PM IST

ములుగు జిల్లా వాజేడు మండలంలో చీకుపల్లి అటవీ ప్రాంతంలోని ప్రఖ్యాత బొగత జలపాతం పొంగి ప్రవహిస్తోంది. తెలంగాణ - ఛత్తీస్​గఢ్ రాష్ట్రాల సరిహద్దు దండకారణ్యంతో పాటు, వాజేడు మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో బొగత జలపాతం నురుగులు కక్కుతూ దూకుతోంది. నలాందేవి, నల్లవాగు, పాల వాగులు పొంగి ప్రవహించడంతో జలపాతం వద్ద ప్రవాహం మరింత పెరిగింది. దీంతో జలపాతం అందాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details