ఘనంగా పోలీస్‌శాఖ బతుకమ్మ సంబురాలు - latest news of police department bathukamma festival
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో గోషామహల్ గ్రౌండ్లో, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. పెద్ద ఎత్తున పోలీసులు తమ కుటుంబాలతో సహా పాల్గొని బతుకమ్మ వేడుకలను నిర్వహించుకున్నారు. సీపీ అంజనీకుమార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆయన సతీమణి అనుపమ.. డీసీపీ వెంకటేశ్వర్లు కుటుంబ సమేతంగా బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. మహిళా పోలీస్ అధికారులు, పలువురు సిబ్బంది బతుకమ్మలతో ఆడిపాడారు.