భుజాలపై కుమారుడి శవం.. గుండె నిండా దుఃఖం.. అర కిలోమీటరు నడుస్తూ... - ఒడిశా రాయగడ జిల్లా వార్తలు
Father Carries Son Dead Body: ఒడిశా రాయగడ జిల్లా హరిజన్ సాహి ప్రాంతంలో హృదయవిదారక ఘటన వెలుగు చూసింది. కుమారుడి మృతదేహాన్ని భుజంపై మోస్తూ ఓ తండ్రి అర కిలోమీటరు నడిచాడు. మృతదేహాన్ని తరలించేందుకు వాహనాలు లేకపోవడమే ఇందుకు కారణం. అనారోగ్యంతో ఉన్న తొమ్మిదేళ్ల ఆకాశ్ బనియాను అతని తండ్రి సుర్ధార్ బనియా ఆదివారం రాత్రి జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చాడు. కానీ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించడం వల్ల మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాలని భావించాడు. కానీ ఎలాంటి వాహనం అందుబాటులో లేకపోయేసరికి భుజాలపైనే మోసుకెళ్లాడు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా అధికారులు.. దర్యాప్తునకు ఆదేశించినట్లు వెల్లడించారు.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST