పసిడి కాంతుల్లో సుందరాంగులు.. అలరించిన హంస నడకలు - Fashion show in slj jewellers
Fashion show in hyderabad: ధగధగ మెరిసే పసిడి కాంతుల్లో మెరుపుతీగలాంటి సుందరాంగులు తళుక్కుమని మెరిసిపోయారు. హైదరాబాద్ సోమాజీగూడలోని ఓ బంగారు ఆభరణాల సంస్థ తమ వినియోగదారుల కోసం సరికొత్త ఆభరణాలతో పాటు ప్రత్యేక ఆఫర్లను ఆభరణాల ప్రియులకు పరిచయం చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జ్యూయలరీ ఎండీ గౌతమ్ జైన్, సినీ వర్ధమాన కథానాయిక శ్రీలేఖతోపాటు నగరానికి చెందిన పలువురు మోడల్స్ పాల్గొని సందడి చేశారు. ఈనెల 21 నుంచి 28 వరకు ఆభరణాల ప్రియుల కోసం నెక్లెస్, బ్యాంగిల్ ప్రత్యేక మేళా నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ఎండీ గౌతమ్‌జైన్ తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST