Prathidwani: దేశంలో పెరిగిపోతున్న ఆరోగ్య అసమానతలు - ప్రతిధ్వని వార్తలు
Prathidwani: దేశంలో ఆరోగ్య అసమానతలు పెరిగిపోతున్నాయి. అడ్డూఅదుపూ లేని వైద్యం ఖర్చుల కారణంగా ఏటా కోట్లాది మంది సామాన్యులు పేదరికంలోకి కూరుకుపోతున్నారు. భారీ స్థాయిలోని ప్రభుత్వ వైద్య వ్యవస్థ, ప్రపంచ స్థాయి ప్రైవేటు వైద్య సంస్థలు దేశంలో పేద, మధ్య తరగతి ప్రజలకు తలకు మించిన భారంగా మారాయి. అనుకోకుండా అనారోగ్యం పాలైన ప్రజలు ఆసుపత్రిలో వైద్య చికిత్సల కోసం జీవితంలో సంపాదించిన ఆస్తిలో అధిక భాగం ఖర్చు చేస్తున్నారు. లేదంటే భారీ అప్పుల్లో కూరుకుపోతున్నారు? అసలు ఈ పరిస్థితి ఎందుకుంది? దేశంలో సామాన్యుల పాలిట గుదిబండగా మారిన వైద్య వ్యవస్థలను సంస్కరించడం ఎలా? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:12 PM IST