బాబీ డ్యాన్స్.. దేవిశ్రీ కేరింతలు.. థియేటర్లలో వీరయ్య పూనకాలు లోడింగ్.. - వాల్తేర్ వీరయ్య సినిమా న్యూస్
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబోలో తెరకెక్కిన చిత్రం వాల్తేరు వీరయ్య. మెగా మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా రోజుల తర్వాత వింటేజ్ మాస్ లుక్‌లో చిరంజీవి కనిపించడంతో అభిమానులు సైతం ఈ చిత్రాన్ని వీక్షించేందుకు భారీగా థియేటర్ల వద్దకు చేరుకుంటున్నారు. థియేటర్ల వద్ద భారీ కటౌట్లు ఏర్పాటు చేసి పాలాభిషేకాలు చేస్తున్నారు. టపాసులు, తీన్ మార్ డ్యాన్స్‌లతో థియేటర్ ప్రాంగణాలు హోరెత్తుతున్నాయి. థియేటర్లలోనూ మాస్ జాతర కనిపిస్తోంది. మెగాస్టార్ స్టెప్పులు, ఇంటర్వెల్ సీక్వెన్స్, రవితేజ చిరు కాంబో సీన్స్ టైమ్‌లో కాగితాలు ఎగురవేసి డ్యాన్సులు చేస్తున్నారు. మరోవైపు, చిరంజీవి కుమార్తెలు శ్రీజ, సుస్మిత, చిత్ర దర్శకుడు బాబీ, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో సందడి చేశారు. అభిమానులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు.