అదంతా ఫేక్.. నేను బతికే ఉన్నాను : కమెడియన్ సుధాకర్ - డెత్ న్యూస్‌పై కమెడియన్ సుధాకర్ స్పందన
తాను చనిపోయానంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై ప్రముఖ సీనియర్ హాస్యనటుడు సుధాకర్ స్పందించారు. తాను సంతోషంగా ఉన్నాననీ, అవన్నీ తప్పుడు వార్తలని ఖండించారు. ప్రజలు తప్పుడు వార్తలను నమ్మొద్దంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. తన ఆరోగ్యంపై కొన్ని రోజులుగా వస్తున్న రూమర్స్‌పై ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాలను క్రియేట్ చేయొద్దని కోరారు.
"నా మీద కొన్ని రోజులుగా వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు. తప్పుడు సమాచారాన్ని నమ్మకండి. ఇలాంటి రూమర్స్‌ను ప్రచారం చేయకండి. నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని సుధాకర్ తెలిపారు. సుధాకర్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై ఆయన అభిమానులు మండిపడుతున్నారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిపై ఇలాంటి అసత్య ప్రచారాలు సృష్టించొద్దని కోరుతున్నారు.
తమిళ దర్శకుడు భారతీ రాజా తెరకెక్కించిన ఓ సినిమాతో సుధాకర్ టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా కూడా అలరించి అభిమానులను మెప్పించారు. తనదైన శైలిలో డైలాగులు చెప్పి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సహాయ నటుడిగా, విలన్‌గా నటించి.. తెలుగు, తమిళ ప్రేక్షకులను మన్ననలు పొందారు. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న సుధాకర్ చనిపోయారంటూ కొన్ని రోజులుగా పుకార్లు వస్తున్నాయి. గతంలోనూ ఆయనపై ఇలాంటి రూమర్స్ వచ్చాయి.