Tollywood Director K Viswanath Passed Away
దివికేగిన కళా తపస్వికి ప్రముఖుల సంతాపం - k viswanath death balakrishna condolence
దిగ్గజ దర్శకుడు కళా తపస్వి కె విశ్వనాథ్ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో సంతాపం తెలుపుతున్నారు. ఆయనతో వారికున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు కూడా అర్పించారు.
Last Updated : Feb 3, 2023, 8:40 PM IST