తెలంగాణ

telangana

Tamannaah Visit New Parliament Building

ETV Bharat / videos

Tamannaah Visit New Parliament Building : కొత్త పార్లమెంట్ భవనంలో మిల్క్ బ్యూటీ.. 'మహిళా బిల్లు'పై తమన్నా హర్షం - గణేశ్ చతుర్థి సంబరాల్లో నటి హన్సికా

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2023, 4:51 PM IST

Tamannaah Visit New Parliament Building :ప్రముఖ సినీ తార తమన్నా భాటియా గురువారం భారత నూతన పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు. భారత లోక్​సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన వేళ.. దేశంలోని పలువురు మహిళా ప్రముఖులకు కేంద్రం ఆహ్వానం పంపింది. ఈ మేరకు తమన్నా పార్లమెంట్ భవనానికి చేరుకున్నారు. అక్కడ ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్​సభలో ఆమోదం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. మంగళవారం పార్లమెంట్​ సెషన్​కు హాజరయ్యారు.

వినాయక పూజలో హన్సికా.. దేశమంతటా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రీసెంట్​గా ప్రముఖ వ్యాపారవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంట గణేశ్ చతుర్థి గ్రాండ్​గా జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ యాక్టర్లు హాజరయ్యారు. ఇక తాజాగా సినీ నటి హన్సికా.. ముంబయిలోని ఓ గణేశ్ మండపాన్ని సందర్శించారు. అక్కడ ఆమె ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details