'ఆమె'తో పెళ్లి కోసం జాతక శాస్త్రం చదివేసిన హీరో.. శివ బాలాజీ- మధుమిత లవ్‌స్టోరీలో ట్విస్ట్! - శివ బాలాజీ మధుమిత జాతంక
సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలానే టాలీవుడ్లో సైతం చాలా మంది ప్రేమించి.. అనేక కష్టాలు ఎదుర్కొని చివరకు వివాహ బంధంతో ఒకటయ్యారు. అలాంటి టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో శివ బాలాజీ, మధుమిత జంట ఒకటి. వీరిద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఇంగ్లీష్ కారన్ అనే సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ టైమ్‌లోనే వీరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. చివరకు 2009లో పెద్దల సమక్షంలో వీరిద్దరు ఒక్కటయ్యారు.
తాజాగా ఈ జంట.. ఈటీవీలో ప్రసారమవుతున్న 'అలా మొదలైంది' సెలబ్రిటీ టాక్ షోకు అతిథులుగా వచ్చారు. వెన్నెల కిషోర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోలో శివ బాలాజీ, మధుమిత పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అయతే మధుమితను పెళ్లి చేసుకుంటే వాళ్ల అమ్మ చనిపోతుందనే భయంతో ఆమెతో పెళ్లికి శివ బాలాజీ బ్రేకప్ చెప్పారట. ఆ తర్వాత ఏడాదిన్నర కాలం పాటు దూరంగా ఉండి.. చివరకు మళ్లీ పెళ్లికి ఒప్పించారట. అయితే మధుమితతో పెళ్లి కోసం ఏకంగా శివ బాలాజీ జాతక శాస్త్రాన్నే చదివేశారట!