థియేటర్లో టికెట్లు అమ్మిన రవితేజ హీరోయిన్లు.. ఎగబడ్డ కుర్రాళ్లు! - రావణాసుర దక్షా
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ.. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. గతేడాది రిలీజైన ధమాకా సినిమాతో విజయం అందుకున్న ఆయన.. మరో మూడు రోజుల్లో రావణాసుర చిత్రంతో థియేటర్లలోకి రానున్నారు. ఈ సందర్భంగా ఆ చిత్రంలో నటించిన కథానాయికలు దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ హైదరాబాద్‌లోని ఏఎంబీ మాల్లో సందడి చేశారు. యంగ్ హీరో సుశాంత్‌తో కలిసి సినిమా టికెట్లను విక్రయించారు. టికెట్ కౌంటర్లో కూర్చొని ప్రేక్షకులతో మాట్లాడుతూ టికెట్లను అందజేశారు. అయితే సుశాంత్, దక్ష, పూజిత రావడంతో వారిని చూసేందుకు పలువురు ప్రేక్షకులు పోటీపడ్డారు. బ్యూటీల చేతుల మీదుగా రావణాసుర టికెట్లు తీసుకునేందుకు ఆసక్తి చూపారు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ధమాకా చిత్రం తర్వాత.. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్యలో కూడా నటించారు. అందులో రవితేజ తన నటనకు మంచి మార్కులు పడ్డాయి.