తెలంగాణ

telangana

ravanasura movie team special interview director said lies to heriones

ETV Bharat / videos

ఒక్క సినిమా కోసం హీరోయిన్లకు 'ఏడు' అబద్ధాలు చెబుతా!: రావణాసుర డైరెక్టర్​ - ravanasura director lies

By

Published : Apr 6, 2023, 4:16 PM IST

టాలీవుడ్​ మాస్​ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్​ మూవీ రావణాసుర. భారీ అంచనాల మధ్య ఈ సినిమా.. ఏప్రిల్​ 7న విడుదల కానుంది. అయితే మూవీ టీమ్​.. ప్రమోషన్ల బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో రావణాసురలో నటించిన సుశాంత్​, హీరోయిన్లు పూజితా పొన్నాడ, మేఘా ఆకాశ్​, దక్షాలతో కలిసి దర్శకుడు సుధీర్​ వర్మ.. స్పెషల్​ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రవితేజను ఇంతకు మునుపు ఎన్నడూ చూడని పాత్రలో ప్రేక్షకులు చూడబోతున్నారని ఆయన తెలిపారు. సినిమా స్క్రిప్ట్​ విన్నప్పుడు.. స్టోరీ కోసం ఆలోచిస్తానని, తాను తీయగలను అంటే ఇంకా ప్లాన్​ వేస్తేస్తాని చెప్పారు. థియేటర్లలో మాస్​ మహారాజా యాక్షన్​తోపాటు తనలోని మరో కోణాన్ని ఫ్యాన్స్​ ఆస్వాదిస్తారని చెప్పారు. అయితే సినిమా విషయంలో తాను హీరోయిన్ల వద్ద ఒక నిజంతో పాటు ఏడు అబద్ధాలు చెబుతుంటానని సుధీర్​ వర్మ అన్నారు. అందుకు కారణమేంటో తెలియాలంటే పూర్తి వీడియో చూడాల్సిందే.  

ABOUT THE AUTHOR

...view details