తెలంగాణ

telangana

Ram Charan Siddhivinayak Temple

ETV Bharat / videos

Ram Charan Siddhivinayak Temple : ముంబయిలో గ్లోబల్​ స్టార్.. సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న రామ్​ చరణ్

By ETV Bharat Telugu Team

Published : Oct 4, 2023, 11:56 AM IST

Ram Charan Siddhivinayak Temple :  గ్లోబల్​ స్టార్​ రామ్​ చరణ్ తాజాగా ముంబయిలో కనిపించారు. ప్రస్తుతం దర్శకుతు శంకర్​తో 'గేమ్ ఛేంజర్'​ సినిమా చేస్తున్న ఆయన.. బుధవారం ముంబయిలోని ప్రముఖ సిద్ధి వినాయక మందిరాన్ని సందర్శించారు. తాజాగా ఆయన అయ్యప్ప మాలలో కనిపించారు. ఇక రామ్​ చరణ్​ అక్కడికి వస్తున్నారని తెలుసుకుని కొందరు అభిమానులు ఆయన్ను చూసేందుకు వచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో కాస్త సందడి నెలకొంది. ఇక  గుడి ఆవరణలో ఉన్న ఫ్యాన్స్​ను పలకరించిన చరణ్.. అనంతరం స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఆలయంలోని అర్చకులు రామ్​ చరణ్​ను అంగ వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. 

Chiranjeevi Celebrates Ganesh Chaturthi :తాజాగా రామ్​ చరణ్​ తన  కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా వినాయకచవితి పండగ జరుపుకున్నారు. ఈ వేడుకల్లో చరణ్​తో పాటు ఉపాసన చిన్నారి క్లీంకార పాల్గొన్నారు. ఈ విషయాన్ని చిరంజీవి ఓ ట్వీట్​ ద్వారా పంచుకున్నారు.  అయితే ఎప్పటిలా కాకుండా ఈసారి పండగ చాలా స్పెషల్ అని ఆయన అన్నారు.

"అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను. ఈ సారి ప్రత్యేకత.. చిన్ని 'క్లీంకారా' తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం" అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను మెగాస్టార్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details