Rajinikanth Bangalore : బెంగళూరు బస్ డిపోలో రజనీ సందడి.. వాళ్లకు సర్ప్రైజ్! - బెంగళూరులో రజనీకాంత్
Published : Aug 29, 2023, 2:36 PM IST
Rajinikanth Bangalore : సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా బెంగుళూరులోని బీఎంటీసీ బస్ డిపోకు వెళ్లి అక్కడి వారిని సర్ప్రైజ్ చేశారు. స్థానిక మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌కు సంబంధించిన డిపో నెంబర్ 4ను సందర్శించిన ఆయన.. కాసేపు అక్కడి ఉద్యోగులతో కలిసి ముచ్చటించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ ఆయన్ను సోషల్ మీడియాలో కొనియాడుతున్నారు. ఎంత స్టార్ అయినా సరే.. ఆయన ఎక్కడ నుంచి వచ్చారో అక్కడి మూలాలను మరచిపోలేదు అంటూ ప్రశంసిస్తున్నారు. కాగా, సినిమా రంగంలోకి అడుగుపెట్టకముందు రజనీకాంత్ బస్ కండక్టర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడాయన.. ఒకప్పుడు బస్ కండక్టర్‌గా పనిచేసిన నగరంలోని బస్‌స్టాండ్‌ను సందర్శించి గత స్మృతులను నెమరవేసుకున్నారు.
Rajinikanth Jailer Movie : ఇకపోతే రజనీ.. ప్రస్తుతం 'జైలర్' సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. రూ.600కోట్ల వరకు వసూలు చేసింది. ఈ క్రమంలోనే సక్సెన్‌ను ఎంజాయ్ చేస్తూ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న ఆయన తాజాగా చెన్నైకు చేరుకున్నారు. త్వరలోనే 'తలైవర్ 170' సినిమా కోసం సిద్ధం కానున్నారు.