తెలంగాణ

telangana

హైదరాబాద్​ చేరుకున్న ఎన్టీఆర్​

ETV Bharat / videos

టైగర్​ బ్యాక్​ టు హోమ్​.. ఆస్కార్​ ఆనందాన్ని తారక్ మొదటగా​ ఆమెతోనే పంచుకున్నారట! - ఆస్కార్​ నాటు నాటు సాంగ్​

By

Published : Mar 15, 2023, 7:37 AM IST

95వ ఆస్కార్‌ అవార్డుల కార్యక్రమం అమెరికాలో అంగరంగ వైభవంగా ముగిసింది. ఈ ప్రదానోత్సవ కార్యక్రమంలో భారతీయ చిత్రాలు 'ఆర్‌ఆర్ఆర్‌' , 'ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌'కు అవార్డులు వరించాయి. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా సుమారు 18.7 మిలియన్‌ మంది వీక్షించారు. అయితే 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రంలోని నాటు నాటు సాంగ్​కు ఆస్కార్‌ పురస్కారం దక్కడంతో దాన్ని అందుకోవడం కోసం ఆర్​ఆర్​ఆర్​ టీమ్​ మొత్తం అమెరికాకు వెళ్లింది. అయితే ఇప్పుడు అక్కడ నుంచి హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నారు. తెల్లవారు ఝామున 2.30 గంటలకు ఆయన నగరానికి చేరుకోవడంతో..  ఆయనకు శంషాబాద్‌ విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. అప్పటికే పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్న అభిమానులు నినాదాలు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఒక దశలో ఫ్యాన్స్​ను పోలీసులు నియంత్రించలేకపోయారు.  ఇక మీడియాతో ముచ్చటించిన జూనియర్​ ఎన్టీఆర్​..  నాటు నాటు పాటకు ఆస్కర్‌ వచ్చిందని ప్రకటించిన క్షణంలో ఆనందం తట్టుకోలేపోయినట్టు తెలిపారు. ఆస్కార్‌ వేదిక మీద ఆర్​ఆర్​ఆర్‌ టీమ్​ చేతికి ఆస్కార్‌ అందించినప్పుడు అంతకు మించిన ఆనందం ఇంకొకటి లేదనిపించిందన్నారు. తమను ఇక్కడ వరకు తీసుకువచ్చిన అభిమానులకు ప్రజలకు ఆయన పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. రాజమౌళి చేతిలో అవార్డు చూసినప్పుడు కళ్లలో నీళ్లు తిరగాయన్నారు. పురస్కారం దక్కిన విషయాన్ని మొదటగా తన భార్యకు ఫోను చేసి తెలిపి సంతోషం పంచుకున్నట్లు జూనియర్‌ ఎన్టీఆర్‌ వివరించారు.   ఇకపోతే అంతకుముందు ఆస్కార్​ వేడుకలో.. ఓ రిపోర్టర్‌ ఎన్టీఆర్‌ ధరించిన డ్రెస్‌ గురించి అడగ్గా.. 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో తనతో కలసి దూకిన పులి ఇదే'.. అంటూ తారక్​ సరదాగా మట్లాడారు. భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా తాను ఈ వస్త్రధారణలో వచ్చినట్టు చెప్పారు. 

ABOUT THE AUTHOR

...view details