తెలంగాణ

telangana

సంగీత దర్శకుడు రాజ్​కు కన్నీటి వీడ్కోలు

ETV Bharat / videos

సంగీత దర్శకుడు రాజ్​కు కన్నీటి వీడ్కోలు - రాజ్​ మరణంపై కోటీ ఎమోషనల్​

By

Published : May 22, 2023, 3:58 PM IST

గుండెపోటుతో నిన్న హఠాన్మరణం చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ అంత్యక్రియలు ముగిసాయి. మహాప్రస్థానంలోని విద్యుత్ దహన వాటికలో రాజ్ అంత్యక్రియలను నిర్వహించారు. ఆయన పెద్దల్లుడు కృష్ణంరాజు అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. అంతకు ముందు కూకట్ పల్లి హౌజింగ్ బోర్డు కాలనీలోని నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర నిర్వహించారు. మహాప్రస్థానం వద్దకు రాజ్ స్నేహితుడు, సంగీత దర్శకుడు కోటి చేరుకొని స్నేహితుడి భౌతిక కాయాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. రాజ కుమార్తెలను ఓదార్చారు. చెన్నైలో ఉండగా తన గదిలో ఓ నీడ కనిపించిందని, ఆ మరుక్షణమే రాజ్ చనిపోయారనే విషయం తెలిసిందని ఉద్వేగానికి గురయ్యారు. భౌతికంగా రాజ్ తనను వీడినా తన గుండెల్లో ఎప్పుడు భద్రంగానే ఉంటారని కోటి వాపోయారు. దర్శకుల సంఘం అధ్యక్షుడు విశ్వనాథ్, నటులు శివాజీరాజా, దర్శకుడు జయంత్, నిర్మాతల నల్లమలపు బుజ్జీ సహా పలువురు సినీ, సంగీత ప్రముఖులు హాజరై రాజ్ కు కడసారి నివాళులర్పించారు.

ABOUT THE AUTHOR

...view details