హైదరాబాద్‌కు రామ్‌చరణ్.. ఫ్యాన్స్ భారీ ర్యాలీ.. హంగామా మామూలుగా లేదుగా! - రామ్‌చరణ్ బేగంపేట ఎయిర్‌పోర్ట్
ఆస్కార్ వేడుకలకు వెళ్లిన మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్.. హైదరాబాద్ చేరుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట సమయంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరకున్న ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. జై చరణ్, జై ఆర్‌ఆర్‌ఆర్ అనే నినాదాలతో ఎయిర్‌పోర్ట్ ప్రాంగణం మార్మోగింది. పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఆయన ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వచ్చారు. అభిమానులకు అభివాదం చేసి.. తనపై ఇంతటి ప్రేమను చూపిస్తున్న వారికి ధన్యవాదాలు చెప్పారు. అనంతరం ఆయన వాహనం వెనుకే అభిమానులు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఆస్కార్ వేడుకల అనంతరం రామ్‌చరణ్ ఆయన సతీమణి ఉపాసన శుక్రవారం ఉదయం దిల్లీకి చేరుకున్నారు. ఇండియా టుడే కాన్‌క్లేవ్.. కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ.. తర్వాత రాత్రి సమయంలో ఆయన దిల్లీ నుంచి బయలు దేరి.. అర్ధరాత్రి దాటాక నగరానికి చేరుకున్నారు. రామ్‌చరణ్- ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటునాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది.