'నా సినిమా నచ్చకపోతే.. ఇకపై అన్ని చిత్రాలు ఫ్రీగా చూసే అవకాశం కల్పిస్తా' - మధురపూడి గ్రామం అనే నేను శివ కంఠమనేని
Published : Oct 12, 2023, 4:39 PM IST
|Updated : Oct 12, 2023, 4:54 PM IST
Madhurapudi Gramam Ane Nenu Movie :మధురపూడి గ్రామం సినిమా నచ్చకపోతే తన తదుపరి చిత్రాలకు ఉచితంగా సినిమా చూసే అవకాశం కల్పిస్తానని ఆ చిత్ర కథానాయకుడు శివ కంఠమనేని అన్నారు. కత్తి మల్లిఖార్జున్ దర్శకత్వంలో శివ నటిస్తూ నిర్మించిన మధురపూడి ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈటీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన శివ... సాప్ట్ వేర్ రంగం నుంచి స్థిరాస్తి రంగంలోకి అడుగుపెట్టి చివరకు తనకు ఇష్టమైన సినిమా రంగంలో నటుడిగా ప్రయాణం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. రియల్ స్టార్ శ్రీహరితో నటించిన అనుభవాలు ఎప్పటికి మరిచిపోలేనని చెప్పారు. కొన్నాళ్లు సినీ పరిశ్రమకు దూరంగా ఉండాల్సి వచ్చిందని అన్నారు. అయినా సరే... ఎప్పటికప్పుడు సినీ రంగం అభివృద్ధిని, సినిమాల తీరును గమనిస్తూనే ఉన్నానని పేర్కొన్నారు. స్నేహితుల ప్రోత్సాహం వల్ల మధురపూడి గ్రామంతో మళ్లీ నటుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని శివ కంఠమనేని తెలిపారు. సినిమా బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.