Lalbaugcha Raja 2023 Shahrukh Khan : లాల్ బాగ్చా గణేశుడి దర్శనానికి షారుక్.. కొడుకుతో కలిసి సందడి.. వీడియో చూశారా? - షారుక్ ఖాన్ లేటెస్ట్ న్యూస్
Published : Sep 21, 2023, 9:17 PM IST
Lalbaugcha Raja 2023 Shahrukh Khan :మహారాష్ట్ర ముంబయిలోని లాల్‌బాగ్చా గణనాథుడిని బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ దర్శించుకున్నారు. కింగ్ ఖాన్ వెంట ఆయన చిన్న కుమారుడు అబ్రమ్ ఖాన్ ఉన్నాడు. ఎరుపు రంగు కుర్తా ధరించిన అబ్రమ్.. తన క్యూట్ లుక్స్‌తో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. ఇక షారుక్ తన కుమారుడితో కలిసి.. గణనాథుడికి గురువారం.. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మండప నిర్వహకులు ఆయనకు జ్ఞాపికను అందజేశారు.
కాగా, 1934 నుంచి అక్కడ విఘ్నేశ్వరుడి ఉత్సవాలు జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఇక బాలీవుడ్ బాద్‌షా గణనాథుడిని దర్శించుకునేందుకు రావడం వల్ల అభిమానులు మండపానికి పోటెత్తారు. షారుక్ ఖాన్ ప్రస్తుతం 'జవాన్' సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ సినిమా.. థియేటర్లలో హౌస్‌ఫుల్ షోస్‌తో రన్ అవుతూ.. వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్ల వైపు దూసుకుపోతోంది. ఇక షారుక్ 'డంకీ' సినిమా చేయనున్నారు. ఈ చిత్రంలో ఆయనకు జోడీగా నటి తాప్సీ పన్ను నటించనున్నట్లు తెలుస్తోంది.