రాజ్-కోటి.. 200 సినిమాలకు మ్యూజిక్.. కాలం కలిపిన స్నేహం విడిపోవడానికి కారణమిదే!
రాజ్-కోటి.. ఒకప్పుడు టాలీవుడ్లో ఈ బ్రాండ్‌కు ఉన్న క్రేజే వేరు. పోస్టర్‌పై ఈ సంగీత ద్వయం పేరు కనిపించిందంటే.. ఆ సినిమా పక్కాగా మ్యూజికల్ హిట్ అవ్వాల్సిందే. వీరిద్దరూ కలిసి మన ఆడియెన్స్‌కు ఎన్నో ఎవర్గ్రీన్ సూపర్ హిట్ సాంగ్స్ అందించారు. దశాబ్దాలపాటు సినీప్రియులను తమ సంగీతంతో అలరించారు. వీరి కాంబోలో వచ్చిన 'యముడికి మొగుడు', 'కొండవీటి రౌడీ', 'కొదమ సింహం', 'కర్తవ్యం', 'పెద్దరికం', 'మెకానిక్ అల్లుడు', 'ముఠా మేస్త్రీ', 'హలో బ్రదర్' వంటి ఆల్బమ్స్ సూపర్ సక్సెస్ అందుకున్నాయి. అయితే విశేష ఆదరణ సొంతం చేసుకున్న వీరిద్దరూ అనుకోని కారణాలతో సుమారు పదేళ్లపాటు దూరంగా ఉన్నారు. మనస్పర్థలు పోయి కలిసినప్పటికీ.. ప్రొఫెషనల్‌గా కలిసి పనిచేయలేదు. అయితే ఇప్పుడా ద్వయంలో రాజ్(68) ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణంతో సంగీత ప్రపంచంలో విషాదం నెలకొంది. దీంతో ఆయన మిత్రుడు కోటి భావోద్వేగమయ్యారు. ఈ సందర్భంగా గతంలో తామిద్దరు విడిపోవడం గతంలో ఆలీతో సరదాగా ఇంటర్వ్యూలో మాట్లాడారు. కాలమే తమని కలిపిందని, కాల ప్రభావంతోనే తాము విడిపోయామని అన్నారు. ఇంకా పలు విషయాల గురించి మాట్లాడారు..
కాలం కలిపిందిలా..! అలనాటి మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి వద్ద రాజ్, కోటి అసిస్టెంట్స్‌గా చాలాకాలం పనిచేశారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. తరచూ సంగీతం గురించే మాట్లాడుకునేవాళ్లు. 1982లో తెరకెక్కిన 'ప్రళయగర్జన' చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేసే అవకాశం రాజ్‌కు లభించింది. అయితే తన ఫ్రెండ్ కోటితో కలిసి సంగీత ద్వయంగా ఎంట్రీ ఇవ్వాలని ఆయన భావించారు. అలా, వీరిద్దరూ కలిసి ఆ సినిమాతోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో కృష్ణ, శోభన్‌బాబు, చిరంజీవి.. ఇలా ఎంతోమంది స్టార్స్ చిత్రాలకు వీళ్లు పనిచేశారు.
ఇదీ చూడండి:ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత