అవసరం లేకపోయినా సెట్లోనే అనుపమ, దర్శకుడి వింత ఆర్డర్ - కార్తీకేయ న్యూస్
అనుపమ పరమేశ్వరన్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కార్తికేయ 2 దర్శకుడు చందూ మొండేటి. అనుపమను సెట్ నుంచి పంపించాలని అనిపించదన్నారు. ఆమె అవసరం లేకున్నా సెట్లో అలా ఖాళీగా ఉంచుతానని చెప్పారు. కార్తికేయ 2 విడుదలకు ఎదురైన అవాంతరాలను కృష్ణుడే చూసుకొని తొలగించారని అన్నారు. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కార్తికేయ 2 భారీ వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది. తెలుగులోనే కాకుండా హిందీలోనూ అత్యధిక థియేటర్లలో ప్రదర్శితమవుతూ రోజురోజుకు ప్రేక్షకుల ఆదరణను మరింత పెంచుకుంటోంది. ఈ సందర్భంగా కృష్ణాష్టమిని పురస్కరించుకొని కార్తికేయ 2 ప్రయాణంలోని మరిన్ని ఆసక్తిక విశేషాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది చిత్ర బృందం. ఆ సంగతులేంటో మీరే చూడండి.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST