హీరో నిఖిల్ టీమ్‌కు షాక్.. పాక్ బోర్డర్లో షూటింగ్ చేస్తుంటే... - హీరో నిఖిల్ కార్తికేయ 2 ఆలీతో సరదాగా
హీరో నిఖిల్.. నటించిన తాజా చిత్రం 'కార్తికేయ 2'. చందూ మొండేటి దర్శకుడు. వీరిద్దరి కాంబోలో వచ్చి సూపర్‌హిట్‌గా నిలిచిన 'కార్తికేయ'కు సీక్వెల్‌గా మిస్టరీ థ్రిల్లర్‌గా 'కార్తికేయ 2' రూపొందింది. శ్రీనివాసరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఆగస్టు 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా ఆలీతోసరదాగా కార్యక్రమానికి నిఖిల్, చందూ మొండేటి గెస్టులుగా విచ్చేసి సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను తెలిపారు. ఈ క్రమంలోనే పాక్ బోర్డర్లో జరిగిన సంఘటనను గుర్తుచేసుకున్నారు. ఆ విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి....
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST