తెలంగాణ

telangana

etv suma adda show sameer says about balakrishna

ETV Bharat / videos

'బస్ డోర్ తీసి జనాల్లోకి తోసేశారు'.. బాలయ్య చేసిన పనికి సమీర్ షాక్! - సమీర్​ బాలకృష్ణ

By

Published : Mar 13, 2023, 3:20 PM IST

టాలీవుడ్​లో నటుడు సమీర్​ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అటు నందమూరి హీరోలతో, ఇటు మెగా హీరోలతో సమీర్​ చాలా క్లోజ్​గా ఉంటారు. చిరంజీవి, బాలకృష్ణతో కలిసి ఆయన పలు సినిమాల్లో నటించి మెప్పించారు. ఇద్దరు అగ్ర హీరోలతోనూ ఆయన చాలా సన్నిహితంగా ఉంటారు. తాజాగా బాలయ్య గురించి సమీర్ ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ఓసారి తనను డోర్ తీసి జనాల్లోకి తోసేసిన ఘటన గురించి సమీర్​ గుర్తు చేసుకున్నారు. లెజెండ్ సినిమా విజయ యాత్రలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. తాజాగా ఈటీవీలో ప్రసారమయ్యే సుమ అడ్డా సెలెబ్రిటీ టాక్​ షోకు గెస్టుగా వచ్చిన ఆయన పలు ఆసక్తికర విషయాలను వివరించారు. ఈ షోలో సుమ సమీర్​ను ఓ ప్రశ్న అడిగారు. ఓ సినిమా ప్రమోషన్ ఈవెంట్​లో బాలయ్యతో ఓ సంఘటన జరిగిందట కదా? అదేంటో చెప్పాలని కోరారు సుమ. అప్పుడు ఆ రోజు ఏం జరిగిందో సమీర్ వివరించారు. "అంత దూరంలో థియేటర్ ఉంది. గేట్‌కు మేమున్న బస్‌కు చాలా దూరం ఉంది. బాబు మనం అక్కడికి ఎలా వెళ్తామని అడిగాను. చూస్తావా? ఎలా వెళ్తానో అని అంటూ, డోర్ తీసేసి నన్ను తోసేశారు" అంటూ ఆ రోజు జరిగిన విషయాన్ని వివరించారు. మరి బాలయ్య ఎలా వచ్చారో కూడా తెలిపారు. మరో సినిమా షూటింగ్​లో భాగంగా బాలయ్య.. సమీర్​పై చేయిచేసుకున్నారట. అంతే కాకుండా ఆ తర్వాత ఏం రా పగిలిందా అని నవ్వుతూ అడిగారట. సమీర్​ చెప్పిన పలు ఆసక్తికర విషయాలు మీకోసం.

ABOUT THE AUTHOR

...view details