టర్కీ నుంచి కృష్ణంరాజుకు బాలయ్య నివాళి.. మూవీటీమ్‌తో కలిసి మౌనం.. - కృష్ణంరాజు మృతి
సీనియర్ నటుడు కృష్ణంరాజు మృతి తనను తీవ్రంగా కలచివేసిందని ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఎన్బీకే 107 షూటింగ్ కోసం టర్కీలో ఉన్న ఆయన.. చిత్రబృందంతో కలిసి మౌనం పాటిస్తూ నివాళులు అర్పించారు. సినీ, రాజకీయ రంగాలలో కృష్ణంరాజుది చెరగని ముద్ర అని కొనియాడారు. విలక్షణ నటనతో ప్రేక్షకుల గుండెల్లో రెబల్ స్టార్‌గా స్థానం సంపాదించుకున్నారని ప్రశంసించారు. కృష్ణంరాజుతో కలిసి తాను నటించిన సినిమాలను గుర్తు చేసుకున్న బాలయ్య.. అది తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప అనుభవమని అన్నారు. కృష్ణంరాజు మన మధ్య లేకపోవడం దురదృష్టకరమన్న బాలయ్య.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST