ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్.. 10 వేల అడుగుల ఎత్తు నుంచి దూకి అనౌన్స్మెంట్..! - ar rahman concert malaysia 2023
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ మలేసియాలోని కౌలాలంపూర్‌లో 2023 జనవరి 28న జరగనుంది. దీని కోసం డీఎంవై మీడియా ప్రొడక్షన్ కంపెనీ ఛైర్మన్ మహ్మద్ యూసఫ్ ప్రత్యేకంగా ప్రచారం నిర్వహించారు. హెలికాప్టర్లో 10 వేల ఫీట్ల ఎత్తు నుంచి పారాచూట్‌తో దూకారు. అనంతరం మలేసియా జాతీయ జెండాతో పాటు, ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ జెండాను ప్రదర్శించారు. ఈ వీడియోను రెహమాన్ ట్విట్టర్లో షేర్ చేశారు. ఇటీవల రెహమాన్ కంపోజ్ చేసిన 'వెందు తనంత కాదు' అనే ఆల్బమ్ విడుదలైంది. దీనికి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. దీంతో మలేసియాలో కాన్సర్ట్ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఏడు సంవత్సరాల తర్వాత రెహమాన్ కాన్సర్ట్ మలేసియాలో జరగబోతోంది.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST