Akshay Kumar In Ujjain : మహాకాళేశ్వరుడి ఆలయాన్ని సందర్శించిన అక్షయ్, ధావన్.. ప్రపంచకప్ గెలవాలని.. - అక్షయ్ కుమార్ కొత్త సినిమా
Published : Sep 9, 2023, 10:40 AM IST
Akshay Kumar In Ujjain : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ శనివారం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వరుడి ఆలయాన్ని సందర్శించారు. అక్షయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మహాకాళేశ్వరుడిని దర్శించుకున్నారు. ఉదయం భస్మ హారతి సమయంలో అక్షయ్, ధావన్ ఆలయ ప్రాంగణంలో భజనలు చేశారు. ఇక అక్షయ్ పూర్తిగా కాషాయం ధరించగా.. ధావన్ తెలుపు దుస్తుల్లో కనిపించారు. అనంతరం వారిద్దరూ గర్భగుడిలో భక్తి శ్రద్ధలతో మహాకాళేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంతో వైభవంగా జరిగిన ఈ పూజా కార్యక్రమంలో అక్షయ్ కుమారుడు ఆరవ్, మేనకోడలు సిమర్, సోదరి హరినందని పాల్గొన్నారు. తన కొత్త చిత్రం 'మిషన్ రాణిగంజ్' మంచి విజయం సాధించాలని భగవంతుడ్ని ప్రార్థించినట్లు నటుడు అక్షయ్ కుమార్ తెలిపారు. "2023 ప్రపంచ కప్లో టీమ్ఇండియా విజయం సాధించాలని దేవుడిని కోరుకున్నా" అంటూ క్రికెటర్ ధావన్ అన్నారు. ఒకేసారి ఇద్దరు సెలెబ్రిటీలు ఆలయాన్ని సందర్శించడం వల్ల ఉజ్జయిని ప్రాంతం కోలాహలంగా మారింది.