Lalbaugcha Raja 2023 Adah Sharma : లాల్ బాగ్చా గణేశుడికి అదా శర్మ ప్రత్యేక పూజలు.. శంఖం చేత పట్టి మరీ.. - ముంబయి గణేశుని దర్శించిన అదా శర్మ
Published : Sep 22, 2023, 9:46 AM IST
|Updated : Sep 22, 2023, 10:50 AM IST
Adah Sharma Mumbai Ganesh : దేశంలో గణేశ్ చతుర్థి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. చవితి రోజు నుంచి ప్రారంభమయ్యే ఈ నవరాత్రును భక్తులు ఎంతో కోలాహలంగా జరపుకుంటున్నారు. చిన్న పెద్దా తేడా లేకుండా అందరూ కలిసి విఘ్నేశ్వరున్ని కొలువుతీర్చిన మండపాల వద్ద భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ వేడుకలు చేసుకుంటున్నారు. ఇక ముంబయి వాసులు వినాయక చవితిని ఎంతో ఘనంగా జరుపుకుంటుంటారు. పెద్ద వినాయకుని స్థాపించి పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా అక్కడి లాల్ బాగ్చా వినాయకుడు ఎంతో ప్రసిద్ధి. ఈ క్రమంలో తాజాగా ఆ గణనాథుడ్ని నటి అదా శర్మ సందర్శించారు. సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ఆమె.. గణేశుని ఎదుట శంఖం ఊదారు. ఆ తర్వాత విఘ్నేశ్వరుడికి పూజలు చేశారు. ట్రస్ట్ సభ్యులు అదా శర్మకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Lalbaugcha Raja 2023 Shahrukh Khan :తాజాగా లాల్ బాగ్చా గణనాథుడిని బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ దర్శించుకున్నారు. కింగ్ ఖాన్ వెంట ఆయన చిన్న కుమారుడు అబ్రమ్ ఖాన్ ఉన్నాడు. ఎరుపు రంగు కుర్తా ధరించిన అబ్రమ్.. తన క్యూట్ లుక్స్‌తో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. ఇక షారుక్ తన కుమారుడితో కలిసి.. గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత వారికి మండప నిర్వహకులు జ్ఞాపికను అందజేశారు.