తెలంగాణ

telangana

actor naresh on his marriage issue

ETV Bharat / videos

'పెళ్లి భోజనం ఎప్పుడు పెడతారు?'.. పవిత్రతో మ్యారేజ్​పై నరేశ్​ రిప్లై ఇదే! - నరేశ్​ పవిత్ర పెళ్లి వీడియో

By

Published : Mar 10, 2023, 7:27 PM IST

నరేశ్​-పవిత్ర 'పెళ్లి వీడియో' రిలీజ్ చేసి ఆశీస్సులు కావాలంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన నటుడు నరేశ్.. ఆ వీడియోపై​ స్పందించారు. హైదరాబాద్ హైటెక్ సిటీ ట్రైడెంట్ హోటల్​లో 'ఇంటింటి రామాయణం' సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు నరేష్ సమాధానం ఇచ్చారు. మీ పెళ్లి ఎప్పుడు? పెళ్లి భోజనం ఎప్పుడు? అన్న ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తనకూ రీల్ లైఫ్, రియల్ లైఫ్ ఉన్నాయని అన్నారు. ప్రాథమికంగా తన జీవితం తాను అనుభవిస్తున్నానని చెప్పారు. త్వరలో పెళ్లి అంశంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. తాను మీడియాతో ఎల్లప్పుడూ మంచి స్నేహపూర్వకంగా ఉంటానని... అప్పటి దాకా ఓపిక పట్టండి అని సూచించారు. ఇప్పుడు ఈ విషయంపై మాట్లాడితే ఇంటింటి రామాయణం ప్రమోషన్ పక్కదోవ పడుతుందని చెప్పారు. 

అయితే శుక్రవారం ఉదయం.. ఆ వైరల్​ వీడియోను నరేశ్​ తన ట్విట్టర్​ ఖాతాలో పోస్ట్​ చేశారు. దీంతో సోషల్​మీడియాలో ఆ వీడియా తెగ వైరల్​ అయింది. తమ కొత్త ప్రయాణం ప్రశాంతంగా ఆనందంగా సాగడానికి.. ప్రేక్షకుల ఆశీస్సులు కోరుకుంటున్నట్లు నరేశ్​ తెలిపారు. పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్లు, ఏడడుగులు అంటూ పేర్కొన్న నరేశ్.. 'పవిత్రనరేష్' హ్యాష్​ట్యాగ్​ను జత చేస్తూ వీడియో విడుదల చేశారు. అయితే ఈ పెళ్లి వీడియో ఓ ప్రముఖ దర్శకుడు నిర్మిస్తున్న కొత్త సినిమాలోనిది అని తెలుస్తోంది. కొంతకాలంగా పవిత్రతో కలిసి ఉంటున్న నరేశ్.. ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటిస్తూ వీడియో విడుదల చేశారు. ఆ వీడియో కూడా సినిమా వీడియోనేనని సమాచారం. తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించేందుకే నరేశ్ సినిమా వీడియోలను ట్విట్టర్ ద్వారా బహిరంగంగా విడుదల చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ABOUT THE AUTHOR

...view details