Balagam Movie: 'ఆడియెన్స్ అభిరుచి మారలేదు.. దిల్ రాజు రియల్ హీరో'
సినిమాల వీక్షణలో ప్రేక్షకుల అభిరుచి మారలేదని, దర్శక నిర్మాతలు, నటీనటులే తమ పంథా మార్చుకుంటున్నారని ప్రముఖ సినీనటుడు, మైమ్ కళాకారుడు మధు అన్నారు. ఇందుకు నిదర్శనమే తమ బలగం చిత్రమని వివరించారు. జబర్దస్త్ వేణు దర్శకత్వంలో ఇటీవల విడుదలైన బలగం చిత్రంలో తమ్ముడు పాత్రలో నటించిన మైమ్ మధు.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆకాశవాణి చిత్రం తర్వాత నటుడిగా తనకు బలగంలో మంచి పాత్ర దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. బలగం చిత్రాన్ని గ్రామాలకు గ్రామాలు కలిసి చూడటం ఆ చిత్రానికి దక్కిన గొప్ప అవార్డుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. బలగంలో నటించిన ప్రతీ ఒక్కరికి ఒక్కో గుర్తింపు ఉందని, కానీ ఆ చిత్రాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అన్నీ తానే అయి భుజాలమీద మోసిన నిర్మాత దిల్ రాజే నిజమైన హీరోగా మైమ్ మధు అభివర్ణించారు. బలగం చిత్రీకరణలో ఆస్తకిర సంఘటనలతోపాటు చిత్ర విడుదల తర్వాత దక్కిన ప్రశంసలను మధు ఈటీవీతో పంచుకున్నారు.