గ్రామస్థులపైకి దూసుకొచ్చిన ఏనుగు.. కానీ ఒకే ఒక్కడు.. - ఒడిశా ఫారెస్ట్ ఏనుగు
Elephant Odisha News: ఒడిశా సంబల్‌పుర్ ప్రాంతంలో ఓ ఫారెస్ట్ గార్డ్ ఏనుగు దాడి నుంచి వందలాది మందిని కాపాడారు. సంబల్‌పుర్‌కు సమీపంలోని చాంద్‌చాడి గ్రామంలో ఓ ఏనుగు ప్రవేశించి బీభత్సం సృష్టించింది. పంటపొలాలను నాశనం చేస్తూ అడ్డొచ్చిన వారిపై దాడికి దిగింది. వెంటనే గ్రామస్థులు అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ గార్డ్ చిత్త రంజన్ మిరి సహా మరికొంతమంది అక్కడికి చేరుకున్నారు. వారి వద్ద ఎటువంటి ఆయుధాలు లేకున్నా కాగడ సాయంతో చిత్తరంజన్ ఏనుగును అదుపు చేశారు. ధైర్యంగా ఆ ఏనుగును అడవిలోకి తరిమేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఉన్నతాధికారులు సహా నెటిజన్లు చిత్తరంజన్‌ను ప్రశంసిస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST