పండగ పూట ఫుల్గా తాగి బ్రిడ్జ్పైకి.. ఇరుక్కుపోయి హల్చల్! - ఉత్తరాఖండ్ తాజా వార్తలు
Drunken Youth Stuck at Bridge: ఉత్తరాఖండ్, కోట్ద్వార్లో హోలీ పండగ పూట ఫుల్గా మద్యం తాగాడు ఓ యువకుడు. తాగిన మైకంలో కోట్ద్వార్లోని బ్రిడ్జి పిల్లర్పైకి ఎంచక్కా ఎక్కేశాడు. అయితే ఆ తర్వాత కిందకు దిగేందుకు నానా అవస్థలు పడ్డాడు. అయినా దిగలేక పోయాడు. అయితే కొద్దిసేపటివరకు ఎవరూ అతడ్ని పట్టించుకోలేదు. దీంతో కొద్దిసేపటితర్వాత రక్షించండి అంటూ పెద్దగా కేకలు వేయడం మొదలు పెట్టాడు. యువకుడి కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.. యువకుడ్ని తాడు సాయంతో సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. దీంతో అక్కడున్నవాళ్లు ఊపిరి పీల్చుకున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST