CCTV Video: గన్స్‌తో బెదిరించి నడిరోడ్డుపైనే లూటీ - దిల్లీలో గన్ పాయింట్ లూటీ
Delhi gunpoint loot: దిల్లీలో నడిరోడ్డుపైనే తుపాకులతో బెదిరించి లూటీకి పాల్పడ్డారు ఇద్దరు దుండగులు. ఆదివారం ఉదయం వివేక్ విహార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరిని.. అక్కడే బైక్‌పై వచ్చి ఆగి ఉన్న ఇద్దరు వ్యక్తులు అడ్డుకున్నారు. అనంతరం గన్ బయటకు తీసి బెదిరించారు. తమ వద్ద ఉన్న విలువైన వస్తువులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం వెతుకుతున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST